పత్తికొండ మండలంలోని అగ్రహారం మండిగిరికి చెందిన లక్ష్మన్న (60) రెండు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కొడుకు తెలిపారు. కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్సలో కోలుకోలేక మరణించినట్లు పేర్కొన్నారు. ఘటనపై పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.