అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో గంజాయికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. గంజాయి వద్దు మంచి భవిష్యత్తు ముద్దు అంటూ నినాదాలు చేశారు. జీకే వీధి మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన సుమారు 3000 మంది గిరిజనులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. గంజాయి పంటకు ప్రత్యామ్నాయ పంటలుగా పలు పంటలు వేస్తూ మంచి జీవితం గడపాలంటూ వారు నినాదాలు చేశారు.