గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్, ప్రియదర్శిని నగర్, కాల్వగడ్డ, బంగాల్పేట్, నాయుడు వాడ, భాగ్యనగర్, రామ్ నగర్, ఆదర్శనగర్, ఈదిగాంతో పాటు పలు కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల నిర్వహకులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. శనివారం నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. ఇందులో బీజేపీ నాయకులున్నారు.