అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ లో ఆటోమొబైల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కోసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. 10 లక్షల పైబడి ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.