జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ -తక్కళ్లపెల్లి గ్రామాల మధ్య వాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి గ్రామస్థులు వినతి పత్రం ఇచ్చారు. వాగు పై బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెద్ది పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరినట్లు స్థానికులు పేర్కొన్నారు.