బంజారా, లంబాడి సాంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ అని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం సాయంత్రం ములుగులోని లంబడా తీజ్ పండుగ ఉత్సవాల్లో కలెక్టర్, డిఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ మహేందర్ జి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లంబాడిల ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని తరతరాలకు అందించడం అభినందనీయం అన్నారు.