గురువారం వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల ప్రకారం వాస్తవిక యూరియా నిలువలు ఉన్నాయా లేదా అన్న విషయాలను కలెక్టర్ పరిశీలించారు అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులకు సరిపడా యూరియా నిలువలు ఉండేలా చర్యలు చేపడతామని సంబంధిత రైతులకు హామీ ఇచ్చారు. యూరియా కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.