నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రాజెక్టు అధికారి మధు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు కాగా ప్రస్తుతం 643.25 అడవులకు చేరిందన్నారు. ఇంట్లో 5065 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40197 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలిపారు. మూడు ట్రస్టు గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి దిగునకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.