కర్నూలు జిల్లా :కర్నూలు నగరంలో వృద్దురాలి హత్య కేసును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. హత్య నేరానికి ఇంటి పనిమనిషి కురువ వరలక్ష్మి (49)ను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుండి 11 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్లు, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, డిఎస్పీ జె.బాబు ప్రసాద్, త్రీ టౌన్ సిఐ శేషయ్య, రూరల్ సిఐ చంద్రబాబు నాయుడుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.సెప్టెంబర్ 1న కర్నూలు టౌన్ గణేష్ నగర్‌లోని క