నవాబ్ పేట గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల నిర్వహణ తీరును పరిశీలించేందుకు పిలిపెన్స్ దేశానికి చెందిన డాక్టర్ ఫ్రాన్సిస్ డాక్టర్ లోవేల్ లు జనగామ జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం పశువుల సంత ను సందర్శించారు.'బ్యూరో ఆఫ్ ఎనిమల్ ఇండస్ట్రీ'ఆధ్వర్యంలో విదేశీ డాక్టర్లు పశువులు సంత ను సందర్శించి నిర్వహిస్తున్న లావాదేవీలు పశు వైద్య ప్రజారోగ్య వ్యవస్థ లను గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.అంతేగాక పశువు వ్యాధుల నియంత్రణ యాజమాన్య పద్ధతులు పశు రవాణాకు సంబంధించిన విధివిధానాలను, అందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలుసుకొని సంతృప్తి చెందారు