కల్లూరు అర్బన్ పరిధిలోని సెరీన్ నగర్ 30వ వార్డులో రోడ్లు, కాలువల నిర్మాణం కోసం రూ.50 లక్షల రూపాయలతో పనులు మంజూరు అయ్యాయి. అయితే 50 ఏళ్ళుగా అక్కడ నివసిస్తున్న కొట్టాల వారిని తొలగించాలని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిపిఎం నాయకులు యేసు రాజు, మౌలాలి, పెద్దమధు, షరీఫ్ పేదల నివాసాలు తొలగించవద్దని, లేబర్ తో పనులు చేపట్టాలని అధికారులను కోరారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.