చల్లపల్లి మండలం వెలుగోలు వద్ద కేబి కెనాల్ వాటర్ గట్టుపై నుంచి పొంగి పక్కనున్న పంటపొలాల్లోకి ప్రవహిస్తున్నట్లు స్థానికులు బుధవారం తెలిపారు. వెంటనే కట్ట వేయకపోతే పంటపొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్ట కరిగి నీటి ప్రవాహ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.