Parvathipuram, Parvathipuram Manyam | Dec 28, 2024
కొమరాడ మండల కేంద్రంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి సిహెచ్ అనురాధ అధ్యక్షతన సమావేశం నిర్వహించామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా శనివారంతెలిపారు. అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు కు సంబంధించి తమ న్యాయమైన కోర్కెలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ 42 రోజులు పాటు అనేక విధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరికి కొన్ని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు.