నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసి బెయిల్ ఇప్పించడంలో కోర్టు ను సైతం మోసం చేసిన ఘటనలో 17 మందిపై కేసులు నమోదు చేయగా, 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మీడియాలో సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ నాగ్ రాజ్ ఉన్నారు