మాధవసేవయే మానవసేవగా గుర్తించి ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తికి నోటి క్యాన్సర్ వచ్చిన కారణంగా పెదగంట్యాడ, సీతానగరం అభ్యుదయ కమిటీ సభ్యులు కొంత ఆర్థిక సహాయాన్ని నిత్యవసర వస్తువులను ఎమ్మెల్యే పళ్ళ చేతుల మీదుగా ఇప్పించారు. ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ ఇటువంటి వారి పట్ల దయ చూపి మనం చేసే సహాయాన్ని వారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెంటిరాజు తదితరులు పాల్గొన్నారు