Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం వింజమూరు యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో గ్రావెల్ ను తరలిస్తున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇరిగేషన్ ఈఈ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి పర్మిషన్ తీసుకొని తరలిస్తున్నారని, ఇప్పటివరకు ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారని, మిగతాది తరలిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 145 చెరువుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు