ఈనెల 6న పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలంటూ ఛలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప తెలిపారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు. జీవో 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, హాస్టల్ మెస్ చార్జీలు రూ.3 వేల వరకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.