వాజేడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నేడు గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు ములకల సందీప్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు రాలేదని ఆరోపించారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలు చేసిన ఎంపిక లిస్టులో నిజాయితీ లేదన్నారు. కొన్నిచోట్ల ఇందిరమ్మ ఇళ్ళను అమ్మకానికి కూడా పెట్టారని, లంచం ఇస్తేనే లిస్టులో పేరు పెట్టిస్తామని కొందరు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.