మిషన్ భగీరథ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన తాము, బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బిల్లులు ఇప్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.