వెంకటాచలం మండలంలో కనుపూరు, వడ్డీపాళెం, కసుమూరు గ్రామాలలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, పలు విషయాలు చర్చించారు. కనుపూరు గ్రామంలో పర్యటించి, ఇటీవల గాయపడిన కనుపూరు గ్రామ సర్పంచ్ నాటకం శీనయ్యను పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని గురువారం సాయంత్రం ఐదు గంటలకి కాకాణి అన్నారు