Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: నురుగులు క‌క్కుతున్న కాలుష్యం విశాఖ‌లో ఎక్క‌డో తెలుసా?

India | Sep 3, 2025
విశాఖపట్నం జిల్లాలోని మారికవలస కొమ్మదిలో ఉన్న కొన్ని సీ ఫుడ్స్ కంపెనీలు కలుషిత నీటిని నేరుగా మారికవలస-కాపులుప్పాడ గెడ్డలోకి వదిలివేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో నీరు తీవ్రంగా కలుషితం కావడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కాలుష్యం కారణంగా పర్యావరణంతో పాటు స్థానిక ప్రజల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. బుధ‌వారం గెడ్డ వద్ద భారీగా కలుషిత నీరు చేరినట్లు కనిపించింది. ఈ నీరు సమీపంలోని పంట పొలాల్లోకి, నగరపాలెం నుంచి ప్రవహించే గెడ్డలో కలిసి తీరప్రాంతాన్ని కూడా కలుషితం చేస్తోంది. దీంతో సముద్రంలో చేపలు, తాబేలు వంటి జీవులు చనిపోతున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us