కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఉందన్నారు.గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సచివాలయం వ్యవస్థ, ఆర్బికెల ద్వారా విత్తనాలు, ఎరువులు రైతులు అడిగిన 48 గంటల్లో అందించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరని,ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితితో అప్పుల పాలు అవుతున్నారని తెలిపారు. సుపరిపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.