ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి పెరగడంతో పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ డ్యాం అధికారులు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రాజెక్టు 26 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగుకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,59, 610 క్యూసెక్కులుగా ఉండగా అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ సందర్భంగా కృష్ణా నదికి సంబంధించి ముంపుకు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని చిన్నారులు మహిళలు ప్రజలు ఎవరు కూడా అటువైపుగా వెళ్లదు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.