గురువారం మధ్యాహ్నం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు జిల్లా నాయకులు గుంటూరు పశ్చిమ మండలం, తురకపాలెం గ్రామంలో అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాలను పరిశీలించి, మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీహెచ్ బాబురావు తురకపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడారు తక్షణమే గ్రామంలో వైద్య పరీక్షలు ఎక్కువగా నిర్వహించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, మెరుగైన త్రాగునీటి సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు.