కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల పట్టణం ముస్లిం కోట వీధి 9 వ వార్డులో రోడ్డుపైన విద్యుత్ స్తంభం ఒరిగి ఇండ్లపై పడే పరిస్థితి ఉందని ఆ విద్యుత్ స్తంభం పూర్తిగా పై భాగంలో చీలి ఎప్పుడు కింద పడుతుందో తెలియని పరిస్థితి ఉందని దానిని పునరుద్ధరించాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం కోటలోని ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభాన్ని స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి, వర్షం పడితే తడిసి ఇండ్లపై పడే పరిస్థితి ఉందని అలాంటి సంఘటన జరిగితే ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుందన్నారు.