తీర్థ యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు బైంసా డిపో STI సరియా నాయక్, కండక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కుబీర్ మండల ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చే శనివారం ధర్మపురి, కొండగట్టు, వేములవాడ ఆలయాలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కరోజు కొనసాగే ఈ యాత్రలో ప్రయాణికుడు రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు