మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఓ యువకుడు శనివారం పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైలవరం ఎస్.ఐ. శ్యామ్‌సుందరరెడ్డి గాలింపు చర్యలు ప్రారంభించారు.పోలీసుల అభ్యర్థన మేరకు మైలవరం జలాశయం అధికారులు నదికి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.