సకాలంలో విత్తనాలు ఎరువులు అందించాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దంతాలపల్లి తహసిల్దార్ కు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుగుల లింగన్న ,తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఇరుగును నాగన్న ఆధ్వర్యంలో అందజేశారు. 2025 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ,బహిరంగ మార్కెట్లోకి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులు విక్రయించిన వారి మీద పీడి యాక్ట్ కేసులు పెట్టి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.