చిత్తూరులోని చెన్నై - బెంగళూరు హైవే శృతి మిల్క్ డైరీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య సోమవారం తెలిపారు. బంగారుపాల్యానికి చెందిన హేమంత్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తామని సీఐ పేర్కొన్నారు.