వినాయక మండపాల నిర్వాహకులకు హైదరాబాద్ సిటీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం వీడియో ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపాలకు అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించాలని సరైన విద్యుత్ వైరింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద నీటితోపాటు ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మండపాల వద్ద టపాసులు కాల్చకూడదని హైదరాబాద్ సిటీ పోలీసులు వీడియో విడుదల చేశారు.