నగరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పిల్లారిపట్టులో శ్రీ శ్రీ శ్రీ విజయగణపతి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం పూజా కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ను గ్రామ ప్రజలు, నిర్వాహకులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మహా మంగళ హారతి అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.