ములుగు జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కేంద్రంలో నేడు శనివారం రోజున ఉదయం ఏడు గంటల నుండే PACS కార్యాలయం వద్ద యూరియా వచ్చిందని సమాచారంతో రైతులు బారులు తీరారు. యూరియా సరఫరాలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదును తప్పితే యూరియా వేసిన పంట ఉపయోగం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.