104 మొబైల్ మెడికల్ యూనిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అందుకోసం దశల వారి ఆందోళన చేపడుతామని జిల్లా గౌరవాధ్యక్షులు బి. లక్ష్మణరావు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక పాత గుంటూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో కె. సత్యరాజు అధ్యక్షతన జరిగిన 104 ఎంప్లాయిస్ యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నుండి ఉద్యోగులకు తగ్గించిన వేతనాలు తో సహా చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు.