పెద్ద కడబూరు :మండలం పీకలబెట్టలో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి నాగరాజు రావు, తహశీల్దార్ గీతా ప్రియదర్శిని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. రైల్వే గేటు ఏర్పాటుపై ఆరా తీశారు. గ్రామ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.పీకలబెట్ట గ్రామస్థులు రైల్వే గేటు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నట్లు అధికారులకు తెలిపారు.