బాన్సువాడ లో బిఎస్సి నర్సింగ్ కాలేజీలో సోమవారం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మహా సుదర్శన యాగాన్ని నిర్వహిం చారు. ఉదయం పుణ్యవచనము శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి స్థాపన హోమగుండం వద్ద గణపతి పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నర్సింగ్ కాలేజీ తో పాటు నర్సుల్లాబాద్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.