మండపేట లో స్త్రీ శక్తి పథకం సక్సెస్ పై బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లికివందనం, ఉచిత గ్యాస్, స్త్రీ శక్తి, మహాశక్తి ఇలా ప్రతి పథకంలోనూ మహిళలను ప్రధాన భాగస్వాములు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.