అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే రైతు కూలీకి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. పక్క పొలానికి సంబంధించిన గుడ్డి బాలప్ప తన విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఎదురవడంతో వాటిని మరమ్మత్తు చేయాలని కోరాడు. దీంతో పోల్ ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై గాయాల పాలయ్యాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.