సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని సిర్పూర్ టి, కాగజ్ నగర్ తదితర మండలాలలో ఈద్ మిలాద్ ఉన్ నబి ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతిని కోరుకున్న మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికీ ఆదర్శం కావాలని ముస్లింలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు,