ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ పని చేస్తుందని ASF సీఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నవేగాంలో శక్రవారం పోలిసు కమ్యూనిటి కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాంగా వాహనాల దృవీకరణ పత్రాలను పరిశీలించారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను కట్టించారు. వాహనాలు ఉన్నవారు తప్పని సరిగా అన్ని రకాల సరైన దృవీకరణ పత్రాలు ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలిసులకు సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.