పేర్ని నాని ఆరోపణలు అవాస్తవం, భూములు దోచుకున్నది నువ్వేనని ధ్వజమెత్తిన బందరు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్ స్తానిక పెడన బైపాస్ రోడ్‌లో రంగనాయక స్వామి వారి దేవస్థాన భూముల వద్ద శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్ మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అనంతరం అయన మాట్లాడుతూ, దేవాలయ భూములను అమ్ముకుంటున్నారని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని, వాస్తవానికి దేవాలయ ఆస్తులను దోచుకున్నది పేర్ని నానియే అని మండిపడ్డారు.