యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని చెక్ చేయగా అతని వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది అన్నారు .బీహార్ కు చెందిన మిథున్ కుమార్(33), గాంధీనగర్ కాలనీలో సెంట్రింగ్ పని చేస్తూ నివసిస్తున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.