అనధికార, అక్రమ లేఔట్లలోని ప్లాట్ల యజమానులు యాజమాన్యపు హక్కులను పొందేందుకు ప్రభుత్వం తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. స్కీమును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు. అనధికార, అక్రమ నిర్మాణాలను నగర వ్యాప్తంగా గుర్తించి నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు. రోడ్డు అక్రమణలు, డ్రైను కాలువల పై అడ్డంగా నిర్మించిన ర్యాంపులు, మెట్లు తదితర నిర్మాణాలను, అనుమతులకు మించి నిర్మించిన కట్టడాలను తొలగించి వేస్తామని కమిషనర్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.