పుత్తూరు చెన్నె హైవేపై ప్రమాదం నాగలాపురం మండలం బయట కొడియంబేడు పెట్రోల్ బంక్ పక్కన చెరకు జ్యూస్ దుకాణం ఉంది. నాగలాపురం బజారు వీధికి చెందిన మోహన్ శెట్టి తమిళనాడు ఊతుకోటకు సొంత పనుల మీద వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మోహన్ శెట్టి వస్తున్న బైకు అదుపుతప్పి జ్యూస్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాగలాపురం పిహెచ్సీలో ప్రధమ చికిత్స అనంతరం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.