నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిని మణికర్ణిక ఏసీబీకి పట్టుపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ మంచిదేవులకు చెందిన వ్యక్తి వెయ్యి గజాల ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయగా టిపిఓ మర్నికర్ణిక ఫైల్ ప్రొసీడింగ్ ఇవ్వడానికి ఐదు లక్షల డిమాండ్ చేశారని తెలిపారు. చివరికి నాలుగు లక్షల 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. నాలుగు లక్షలు ఈరోజు ఇస్తుండగా పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.