జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధి గర్మిళపల్లి-ఓడేడు మానేరు వాగులో ఇసుక కోసం వెళ్లిన 8 ట్రాక్టర్లు అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహంలో చిక్కుకున్నాయి. వాగులో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్లు ఇరుక్కుపోయి కదలలేని స్థితిలో నిలిచిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం లేకుండా బయటపడటం గమనార్హం. స్థానిక ఎస్సై తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.