ఉమ్మడి కృష్ణాజిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వంగవీటి మోహన్రంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ఆడప ప్రతాప్ చందు అన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు తక్షణమే స్పందించి ఉమ్మడి కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన్రంగా నామకరణ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రంగా పేరు పెట్టాలని ప్రతిపాదన పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో వంగవీటి రంగా పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన రంగా అభిమానులు సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు