కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన ఉపాధి లేక నష్టపోతున్నామని ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ... జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు వినత పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం సంవత్సరానికి రూ. 30 వేలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేనియెడల ఈనెల 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు టెక్కలి పలాస ఆర్డిఓ కార్యాలయాలు వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.