ఆళ్లగడ్డ పట్టణ శివారులోని పెద్ద చింతకుంట సమీపంలో రోడ్లపై రైతులు మొక్కజొన్న గింజలను పోయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవేపై సర్వీస్ రోడ్డు వెంట, పెద్ద చింతకుంట సమీపంలో వీటిని ఆరబోశారు. దీంతో వాహనాలు ఓకే వైపు వెళ్లాల్సి వస్తుంది. పంట నూర్పిడులతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.