ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ నెలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆదివారం నాంచారయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా జైలు శిక్ష కూడా పడుతుందని నాంచారయ్య వాహనదాలను హెచ్చరించారు. ఇవాళ గిద్దలూరు కొట్టు మద్యం తాగి వాహనం నడిపిన వారికి విధించిన జరిమానా జైలు శిక్ష గురించి ఆయన వెల్లడించారు.