ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు గునిగంటి బుచ్చాలు గారి దశదినకర్మకు హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం,మహబూబాబాద్ జిల్లా,చిన్నగూడూరు మండలం,గుండంరాజుపల్లి గ్రామంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు గునిగంటి బుచ్చాలు ఇటీవల మృతి చెందగా,ఈరోజు జరుగుతున్న వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి కుమారులైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గునిగంటి రాజన్న, జగన్ ,మోహన్ కమలాకర్లను పరామర్శించి వారి తండ్రిగారు బుచ్చాలు చిత్రపటానికి,పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సిపిఎం మహబూబాబాద్ జిల్లా నాయకత్వం ప్రజాసంఘాల నాయకత్వం పాల్గొని ఘన నివాళులు సంతాపం తెలియజేశారు.